సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనపై రాజకీయ ఆసక్తి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి సెప్టెంబర్ 30న సిరిసిల్లలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.
CM Revanth Reddy


హైదరాబాద్ , 28 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి సెప్టెంబర్ 30న సిరిసిల్లలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్రెడ్డి సిరిసిల్లలో పర్యటించబోతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో ఈ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

సిరిసిల్ల పర్యటనలో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను పరిశీలించనున్నారు. , కేటీఆర్ తాజాగా సిరిసిల్లలో భూముల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం చేసిన ఆరోపణలను నిరూపించాలని లేదా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భూముల వివరాలు, సర్వే నంబర్లు, విస్తీర్ణం, సంబంధిత వ్యక్తుల పేర్లు వంటి పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని కేటీఆర్ కోరారు.

సిరిసిల్ల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ కోరారు. సిరిసిల్లలో గత ప్రభుత్వ కాలంలో జరిగిన అభివృద్ధి పనులు, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పోల్చి చూడాలని ఆయన కోరారు. ఈ పరిణామాలతో సీఎం పర్యటన కేవలం అధికారిక కార్యక్రమంగా కాకుండా రాజకీయంగా కూడా ప్రాధాన్యం పొందుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande