ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం.. భట్టి విక్రమార్క
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై హైదరాబాదులో నేడు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.
డిప్యూటీ


హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై హైదరాబాదులో నేడు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

చేతిలో భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని నిరసనలో పాల్గొన్న ఆయన.. ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని అన్నారు.

ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్లోని సభ్యుల మధ్య విభేదాలు, అభ్యంతరాలపై వచ్చిన వార్తల నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వైపు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా వెళ్లారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande