ఫార్మాసిటీ రద్దు చేయాలంటూ ఇబ్రహీంపట్నంలో రైతుల ఆందోళన
ఫార్మాసిటీని రద్దు చేసి, ప్రభుత్వం సేకరించిన తమ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యాచారం మండలానికి చెందిన ఫార్మా బాధిత రైతులు సోమవారం ఇబ్రహీంపట్నంలో ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళనకు దిగడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Farmers


హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.) ఫార్మాసిటీని రద్దు చేసి, ప్రభుత్వం సేకరించిన తమ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యాచారం మండలానికి చెందిన ఫార్మా బాధిత రైతులు సోమవారం ఇబ్రహీంపట్నంలో ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళనకు దిగడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు.

జీవో నంబర్ 31ను అమలు చేసి, ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించాలని కోరారు. తమ భూముల సమస్య పై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ ప్రతిపాదనను రద్దు చేసి తమ భూములను తిరిగి ఇచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande