బంగారం ధరల్లో ఊహించని మార్పు
గత వారం భారత్లో బంగారం ధర రూ.3 వేల మేర పతనమైంది.
Bullion-Market-Gold-Silver


ముంబై, 28 సెప్టెంబర్ (హి.స.)గత వారం భారత్లో బంగారం ధర రూ.3 వేల మేర పతనమైంది. అయితే, ఈ వారం ధరల్లో ఓ మోస్తరు హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ముఖ్యంగా త్వరలో విడుదల కానున్న యూఎస్ ఆర్థిక డేటాతో ధరల పయనంపై మరింత స్పష్టత రానుంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,670గా ఉంది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,994 వద్ద, 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,14,500 వద్ద కొనసాగుతోంది. ఇక నగరంలో కిలో వెండి ధర రూ.2,49,900గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,820 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,940 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,940 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,720 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,990 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికొస్తే.. హైదరాబాద్, కేరళ, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద కొనసాగుతుండగా, డిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతాతో సహా ఇతర నగరాల్లో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande