
జగిత్యాల, 28 సెప్టెంబర్ (హి.స.)
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి అందుతున్న ఫిర్యాదులు, వినతులపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని తెలిపారు. ప్రజావాణి ద్వారా అందిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు, వినతులు అందాయని, వాటిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకొని పరిష్కరించాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు