ఇప్పుటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయo.. మంత్రి పొంగులేటి
ఇప్పుటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావడం ఖాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Minister

వనపర్తి, 28 సెప్టెంబర్ (హి.స.)

ఇప్పుటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావడం ఖాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపి ఓటు చోరి విధానాన్ని ఎండగడుతూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపి మూడు సార్లు అధికారంలోకి వచ్చింది ప్రజల మద్దతుతో కాదు, ఓట్లు దొంగలించి మాత్రమే.. అని బట్టబయలైందన్నారు.

కేంద్ర ఎలక్షన్ కమీషన్ ని బీజేపి పార్టీకి అనుకూలంగా వాడుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

 rajesh pande