సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. సిరిసిల్ల జిల్లా కలెక్టర్
ఈ నెల 30( బుధవారం)రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
Collector


రాజన్న సిరిసిల్ల, 28 సెప్టెంబర్ (హి.స.) ఈ నెల 30( బుధవారం)రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

సీఎం పర్యటన ఏర్పాట్ల పై సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్పీ మహేష్ బి.గితె, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సిరిసిల్ల రగుడు బైపాస్ రోడ్డు సమీపంలోని మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.

హెలిప్యాడ్, బహిరంగ సభా ప్రాంగణంలో భద్రతా చర్యలు, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణను పకడ్బందీగా చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్, వేదిక, పార్కింగ్ ఏర్పాట్లను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని సూచించారు.

మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి పారిశుధ్యం, తాగునీటి సరఫరా ఏర్పాట్లు చేయాలని, ఎన్పీడీసీఎల్ అధికారులు నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande