
మంచిర్యాల, 28 సెప్టెంబర్ (హి.స.) మంచిర్యాల జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
నస్పూర్ మండల కేంద్రంలో కూలీలతో ప్రయాణిస్తున్న ఆటో రోడ్డు దాటుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్లోనే చనిపోగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు