హైదరాబాద్లో సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ మీట్ కు ఏర్పాట్లు
నగరంలో మరో అంతర్జాతీయ స్థాయి వ్యాపార సమావేశానికి వేదిక కానుంది. సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ మీట్ నిర్వహణకు ఏర్పట్లు మొదలైనవి.
Business meet


హైదరాబాద్ , 28 సెప్టెంబర్ (హి.స.)నగరంలో మరో అంతర్జాతీయ స్థాయి వ్యాపార సమావేశానికి వేదిక కానుంది. సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ మీట్ నిర్వహణకు ఏర్పట్లు మొదలైనవి. తెలంగాణను పెట్టుబడులు, వ్యాపారం, సాంకేతికత, ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా మరింతగా పరిచయం చేయడంలో ఇలాంటి అంతర్జాతీయ సమావేశాలు ఉపయోగపడనున్నాయి. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా, లైఫ్సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, స్టార్టప్ రంగాల్లో జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పొందింది. ఈ నేపథ్యంలో గ్లోబల్ బిజినెస్ మీట్ ద్వారా వివిధ దేశాలకు చెందిన సంస్థలు, పెట్టుబడిదారులు, వ్యాపార ప్రతినిధులు, పారిశ్రామిక వర్గాలను ఒక వేదికపైకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించి వివిధ రంగాల్లో కొత్త విధానాలను ప్రకటిస్తూ వస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ విస్తరిస్తున్న పారిశ్రామిక కారిడార్లు, ఫ్యూచర్ సిటీ, డిజిటల్ మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు వంటి రంగాలకు ప్రాధాన్యం పెరుగుతోంది.

ఇలాంటి సమావేశాల్లో పెట్టుబడి ప్రతిపాదనలు మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని మౌలిక వసతులు, నైపుణ్యవంతమైన మానవ వనరులు, పారిశ్రామిక భూమి, రవాణా సదుపాయాలు, విద్యుత్, నీటి లభ్యత వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande