తెలంగాణ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
తెలంగాణలో స్థానికత వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి స్పష్టతనిచ్చింది. స్థానిక రిజర్వేషన్లు పొందాలంటే నాలుగేళ్ల నిబంధన తప్పనిసరి అని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
Supreme court


హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణలో స్థానికత వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి స్పష్టతనిచ్చింది. స్థానిక రిజర్వేషన్లు పొందాలంటే నాలుగేళ్ల నిబంధన తప్పనిసరి అని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

ఈ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.స్థానికత అంశంపై బెల్లం అంకిత దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం ఇవాళ విచారించి డిస్మిస్ చేసింది.

నాలుగేళ్ల విద్యాభ్యాస నిబంధన ఏకపక్షంగా ఉందంటూ పిటిషనర్ తరఫున చేసిన వాదనలను కోర్టు పూర్తిగా తోసిపుచ్చింది.

స్థానికత నిర్ధారణలో రాజ్యాంగబద్ధంగా జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధనలే అంతిమమని కోర్టు స్పష్టం చేసింది.

ఇదే అంశంపై గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రస్తుత ధర్మాసనం మరోసారి నొక్కి చెప్పింది. తెలంగాణలో విద్యాభ్యాసం పూర్తి చేసిన వారికే స్థానికత వర్తిస్తుందని, నిబంధనల ప్రకారం అర్హత సాధించిన వారికే రిజర్వేషన్ల ప్రయోజనాలు దక్కుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande