టీఎంసీ పార్టీ ఎన్నికల గుర్తు అంశం..... సుప్రీంకోర్టు కీలక తీర్పు
త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు అంశంలో ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
Supreme court


న్యూఢిల్లీ, 28 సెప్టెంబర్ (హి.స.)

త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు అంశంలో ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

టీఎంసీ పేరు, ఎన్నికల గుర్తు అంశాన్ని మూడు నెలల్లోగా తేల్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టంది. పార్టీ పేరు, గుర్తు అంశంలో బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు.

అయితే టీఎంసీకి చెందిన రెండు వర్గాలు తమ వాదనలను కేంద్ర ఎన్నికల సంఘం ముందు నాలుగు వారాల్లోగా సమర్పించాలని సుప్రీం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

ఇక ఈ అంశాన్ని మూడు నెలల్లోగా తేల్చాలని కూడా ఎన్నికల సంఘానికి సుప్రీం ధర్మాసనం అల్టిమేటం జారీ చేసింది. టీఎంసీ పేరు, పార్టీ సింబల్ను ఈసీ ఫ్రీజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ కోర్టును ఆశ్రయించారు. అయితే రెండు వర్గాలకు ఈసీ రెండు రకాల పేర్లు, గుర్తులను ఇటీవల కేటాయించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande