
హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల వైఖరితో దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పులో పడిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.
ఎలక్షన్ కమిషన్ బీజేపీకి తొత్తుగా మారి, నిష్పాక్షికతను వదిలేసి ప్రవర్తిస్తోందని ఆయన ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ తీరుతో ఓటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో ఎన్నికల నిర్వహణ పూర్తిగా మ్యానిపులేట్ అయ్యేలా జరుగుతోందని విమర్శించారు. ఎలక్షన్ కమిషనర్ల తీరుపై స్వయంగా అధికారులే తీవ్ర అసంతృప్తితో లబోదీబో మంటున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
బిహార్లో ఆర్జేడీ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి వెనుక ఎలక్షన్ కమిషన్ మోసపూరిత వైఖరి ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..