యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఉత్పత్తిని పెంచే దిశగా TGGENCO
తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఉత్పత్తిని మరింత పెంచాలని TGGENCO నిర్ణయించింది.
Yadadri thermal


హైదరాబాద్ , 28 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఉత్పత్తిని మరింత పెంచాలని TGGENCO నిర్ణయించింది. ప్లాంట్ నుంచి 140 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. ఇందుకు అవసరమైన బొగ్గును ఇతర వనరుల నుంచి సమీకరించే చర్యలు చేపట్టారు అధికారులు. తెలంగాణలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2026-27లో 7,180 మెగావాట్లకు చేరినట్లు TGGENCO తెలిపింది. 2025 జనవరిలో 800 మెగావాట్ల యూనిట్ ప్రారంభం కాగా, 2026-27లో మరో మూడు 800 మెగావాట్ల యూనిట్లు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ వివరించింది.

అయితే విద్యుత్ ఉత్పత్తి పెంచడంలో బొగ్గు సరఫరా కీలక సమస్యగా మారింది. కొత్త గనుల కొరత, కొన్ని సింగరేణి గనులు మూసివేయడం వల్ల బొగ్గు లభ్యతపై ఒత్తిడి ఏర్పడినట్లు TGGENCO పేర్కొంది. ఈ లోటును అధిగమించేందుకు నైనీ బొగ్గు బ్లాక్తో పాటు మహానది కోల్ఫీల్డ్స్ నుంచి బొగ్గును తరలిస్తున్నట్లు తెలిపింది. రోజుకు రెండు బొగ్గు రైళ్లు వస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande