
కర్నూలు, 28 సెప్టెంబర్ (హి.స.) కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కేసీ కెనాల్లో 12 గంటల వ్యవధిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
ఆదివారం రాత్రి అభివర్ధన్ 12 అనే బాలుడు గల్లంతవ్వగా అతడి మృతదేహాన్ని అధికారులు బయటకు తీశారు.
ఇది జరిగి 12గంటలు అవ్వకముందే కొద్దిసేపటి క్రితం మరో యువకుడు అజయ్ కుమార్ 25 ఈతకు వచ్చి కెనాల్ లో గల్లంతయ్యాడు.
ప్రస్తుతం అజయ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదివారం నుండి కేసీ కెనాల్ కు వరద ప్రవాహం పెరిగినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్న సంగతి తెలిసిందే. గతంలోనూ ఇలా చాలామంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ యువతలో మార్పురావడంలేదు. వర్షాకాలంలో ప్రమాదకరంగా ఉన్న ప్రదేశాలకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV