
ముంబై, 29 సెప్టెంబర్ (హి.స.)భారత్లో బంగారం ధరలు ఊహించని స్థాయిలో పతనం అవుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం భయాలు, యూఎస్ ట్రెజరీ బాండ్స్పై రాబడులు పెరగడం, డాలర్ బలపడటం బంగారానికి డిమాండ్ తగ్గేలా చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి (సెప్టెంబర్ 29) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,160కు పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,37,640కు, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,620కు చేరుకున్నాయి. నగరంలో కిలో వెండి రూ.2.44 లక్షలకు దిగొచ్చింది. నిన్న పసిడి ధరలు రూ.2500 మేర, వెండి ధర రూ.5 వేల మేర పతనమైన విషయం తెలిసిందే.
హైదరాబాద్ -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,640 వద్ద ట్రేడవుతోంది.
విజయవాడ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,640 వద్ద ట్రేడవుతోంది.
ఢిల్లీ- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,310 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,790 వద్ద ట్రేడవుతోంది.
ముంబై- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,640 వద్ద ట్రేడవుతోంది.
చెన్నై – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,640 వద్ద ట్రేడవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV