
వరంగల్, 29 సెప్టెంబర్ (హి.స.)
వర్గ విభేదాలు, వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి పార్టీ శ్రేయస్సు కోసం నాయకులు ఐక్యంగా పనిచేయాలని మాజీ మంత్రి కొండా సురేఖ సూచించారు.
వరంగల్ లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, నాయకులందరూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.
కొంతమంది నాయకులు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే సహించేది లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోరు అదుపు లేకుండా, ఇష్టానుసారంగా మాట్లాడే నాయకులను మహిళా కార్యకర్తలతో చిత్తుచిత్తుగా కొట్టిస్తామని హెచ్చరించారు. కొందరు డూప్లికేట్ నేతలు ఎక్కువ మాట్లాడుతున్నారని, నిఖార్సైన నేతలకు పదవులు రావడం లేదని వాపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు