పేదల బతుకులను రోడ్డున పడేయడమేనా మీ ప్రజా పాలన? హరీష్ రావు
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని మద్దూరులో పేదల ఇళ్లను కూల్చివేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
హరీష్ రావు


హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని మద్దూరులో పేదల ఇళ్లను కూల్చివేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కొడంగల్ బిడ్డను అంటూ కొడంగల్ ప్రజల ఇళ్లనే కూల్చేస్తావా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను నడిపించే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇంత కర్కశంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా గౌరవించరా? అని నిలదీశారు.

ఒక్కసారిగా ఇండ్లు కూల్చితే, ఏండ్ల నుండి నివాసం ఉన్నవారు ఒక్కసారిగా ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. పేదల బతుకులను రోడ్డున పడేయడమేనా మీ ప్రజా పాలన? అని ప్రశ్నించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande