
హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స. ) పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో మంగళవారం ఏర్పాటు చేసిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడోత్సవాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా సహకారం అందిస్తే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు లభిస్తాయని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విద్యార్థులకు క్రీడల పై ఆసక్తి పెంపొందించేలా నిరంతరం ఉచిత శిక్షణ, క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయి పోటీలకు సైతం అతిథ్యం అందించబోతున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు