స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.....మంత్రి నారా లోకేశ్
అక్టోబర్లో స్థానిక ఎన్నికలు.. లక్ష్యం ఒక్కటే... స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం: లోకేశ్
లోకేశ్


తిరుపతి, 29 సెప్టెంబర్ (హి.స.)స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి 94 శాతం స్థానాల్లో విజయం సాధించిందని, అదే ఉత్సాహంతో స్థానిక ఎన్నికల్లోనూ అంతకంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధమవ్వాలని.. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలన్నారు. అక్టోబర్లో ఎన్నికలు జరుగుతాయని.. స్థానిక ఎన్నికలు జరగవనే అపోహలు ఎవరికీ వద్దని తెలిపారు. కోర్టు పెండింగులో ఉన్నవి కూడా త్వరితగతిన పరిష్కరించుకుని అన్నింటిలో ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

ఎన్నికలు వాయిదా పడాలన్న గొడ్డలి పార్టీ కుయుక్తులు పని చేయవన్నారు. పొత్తుల అంశంపై సమన్వయ కమిటీ, అధిష్ఠానం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతుండటం శుభపరిణామమని లోకేశ్ అన్నారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు. జలాశయాలు నింపుకునేందుకు ఇదో మంచి అవకాశమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande