శ్రీవారి సేవలో నారా లోకేష్, సింగపూర్ మంత్రి షణ్ముగం
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈరోజు (మంగళవారం) ఉదయం సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగంతో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.
శ్రీవారి సేవలో నారా లోకేష్, సింగపూర్ మంత్రి షణ్ముగం!


తిరుమల, 29 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈరోజు (మంగళవారం) ఉదయం సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగంతో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.

ఏడుకొండల వాడిని దర్శించుకుని ఆశీస్సులు పొందేందుకు నిత్యం దేశవిదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు ఆసక్తిగా తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్, సింగపూర్ దేశ మంత్రి షణ్ముగం ఇద్దరూ కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.

అత్యంత పవిత్రమైన ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో దేశ విదేశాలకు చెందిన ఇద్దరు మంత్రులు కలిసి రావడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. స్వామివారి సన్నిధిలో అడుగుపెట్టిన వీరికి ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఎంతో భక్తిశ్రద్ధలతో వీరు శ్రీవారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం ఇవాళ ఉదయం గౌరవ మర్యాదలతో షణ్ముగాన్ని శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఆలయ అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. ఇరువురు కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

అంతకుముందు సోమవారం రాత్రి తిరుపతి ఎయిర్ పోర్ట్కు చేరుకున్న మంత్రి లోకేశ్కు స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనస్వాగతం పలికారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande