ఢిల్లీ ప్రజలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రూ. 1,941 కోట్ల భారీ అభివృద్ధి కానుక!
ఢిల్లీ ప్రజలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రూ. 1,941 కోట్ల భారీ అభివృద్ధి కానుక!
Amithsha


ఢిల్లీ, 29 సెప్టెంబర్ (హి.స.)

దేశ రాజధానిలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ ప్రజలకు రూ. 1,941 కోట్ల భారీ వ్యయంతో కూడిన నాలుగు కీలక రోడ్డు మౌలిక వసతుల ప్రాజెక్టులను బిహారంగా అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుల ప్రారంభంతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తొలగిపోనున్నాయి.

ఈ అభివృద్ధి పనుల్లో అత్యంత ముఖ్యమైనదైన బారాపులా ఫేజ్-3 ఎలివేటెడ్ రోడ్ కార్డెర్‌ను హోంమంత్రి ప్రారంభించారు. దీనిద్వారా మయూర్ విహార్ ఫేజ్-1 నుంచి ఎయిమ్స్ వరకు ప్రయాణం పూర్తిగా సిగ్నల్-ఫ్రీగా మారనుంది. సరాయ్ కాలే ఖాన్ వద్ద ఉన్న ప్రస్తుత బారాపులా ఫ్లైఓవర్‌తో అనుసంధానమయ్యే ఈ సుమారు 9 కిలోమీటర్ల స్ట్రెచ్ వల్ల తూర్పు, దక్షిణ ఢిల్లీ మధ్య రాకపోకలు అత్యంత సులభంగా మారుతాయని, వాహనదారుల విలువైన సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.

ఇంజనీరింగ్ పరంగా పలు అడ్డంకులను దాటుకుని పూర్తయిన ఈ ప్రాజెక్టులతో పాటు, నగరంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు మరికొన్ని ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ మౌలిక వసతుల కల్పనతో ఢిల్లీ రోడ్డు నెట్‌వర్క్ మరింత పటిష్టమై, లక్షలాది మంది దైనందిన ప్రయాణం ఎంతో సులభతరం కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande