శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు!
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు. ప్రస్తుత నీటి మట్టం, ఇన్ఫ్లో, ఔట్ఫ్లో వివరాలతో పాటు జల విద్యుత్ ఉత్పత్తి సమాచారం ఇక్కడ చూడండి.
శ్రీశైలం


శ్రీశైలం, 29 సెప్టెంబర్ (హి.స.)శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వస్తోంది. దాంతో జలాశయం నిండుకుండలా మారింది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు లేకపోయినా ఎగువ నుంచి వస్తున్న నీటితో జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. గోదావరితో పాటు కృష్ణా నదికి కూడా భారీగా వరద నీరు చేరుకుంది.

జూరాల నుంచి శ్రీశైలానికి రోజురోజుకూ వరద ఉధృతి పెరుగుతోంది. తాజాగా జూరాల నుంచి 2,248 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి చేరింది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇన్ ఫ్లో : 2,248 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో :23,050 క్యూసెక్కులు ఉంది. మొత్తం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుుతం 854.20 అడుగులు నీటిమట్టం ఉంది. ఇక పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.807 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం : 89.7132 టీఎంసీలు ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande