రుతుపవనాల తిరోగమనం.. రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం కావడంతో భారీ వర్షాలు తగ్గి పొడి వాతావరణం ఏర్పడనుంది.
Rain


అమరావతి, 29 సెప్టెంబర్ (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం కావడంతో భారీ వర్షాలు తగ్గి పొడి వాతావరణం ఏర్పడనుంది. ఆకాశం నిర్మలంగా మారడంతో రాబోయే రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగి తీవ్రమైన ఉక్కపోత ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. రైతుల పంట కోతలకు ఇది అనుకూలమైన సమయమైనప్పటికీ, వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది

ఏపీ వెదర్ రిపోర్ట్..

ఈ రోజు మంగళవారం (29-09-26) మన్యం, అనకాపల్లి, కోనసీమ, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లోని అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. మిగిలిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

తెలంగాణ వాతావరణ సూచన..

ఇదిలాఉంటే.. తెలంగాణ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande