బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో అక్రమ మద్యం పట్టివేత
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో అక్రమ మద్యం పట్టివేత
liqueur


అమరావతి, 03 సెప్టెంబర్ (హి.స.)

పట్టణంలో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వ్యక్తిని గురువారం ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.పి. కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారంతో చేపట్టిన తనిఖీల్లో సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామానికి చెందిన తాండ్ర బుజ్జయ్య (53) పోలీసులకు చిక్కాడు.

అతని వద్ద నుంచి 9 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఏపీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరిధిలో అక్రమ మద్యం రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్, ఎస్సై కృష్ణ హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande