
అమరావతి, 03 సెప్టెంబర్ (హి.స.)
జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5,6 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ తెలిపారు.
రెండు రోజులూ బూత్ స్థాయి అధికారులందరూ తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లోనే ఓటర్లకు అందుబాటులో ఉండాలని ఆయన కోరారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వివేక్ యాదవ్, డిప్యూటీ సీఈవో శనపతి ఢిల్లీరావు గురువారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జేసీ పాల్గొని, జిల్లాలో జరుగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియ పురోగతిని వారికి వివరించారు.
అనంతరం ఆయన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎన్నికల అధికారులకు సూచనలు చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఓటర్లకు కావలసిన పూర్తి సమాచారం ఇవ్వాలని, వారికి తలెత్తుతున్న సందేహాలను నివృత్తి చేయాలని ఆయన కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ