టీటీడీ డిప్యూటీ ఈ ఓ లోకనాథం అరెస్టు
టీటీడీ డిప్యూటీ ఈ ఓ లోకనాథం అరెస్టు
టీటీడీ డిప్యూటీ ఈ ఓ లోకనాథం అరెస్టు


తిరుపతి, :, 03 సెప్టెంబర్ (హి.స.)

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో లోకనాథంను ఈరోజు(గురువారం) ఉదయం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నిన్న(బుధవారం) లోకనాథం నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. లోకనాథం నివాసంతోపాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. తిరుపతి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వరంలో ఐదు బృందాలుగా ఏర్పడి సోదాలు చేపట్టారు.

ఈ దాడుల్లో సుమారు రూ.5 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి,రూ.12.50 లక్షల నగదులభ్యమైంది. భార్య, కుమారుడి పేర్లతో ఇళ్లు, స్థలాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. నిన్న ఉదయం నుంచి చేపట్టిన సోదాలు ముగియడంతో ఈరోజు లోకనాథంను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande