రైతుబీమాపై రైతులకు దిగులు
మహబూబాబాద్ జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో దిగులు పడుతున్నారు.
Farmers insurance


మహబూబాబాద్, 03 సెప్టెంబర్ (హి.స.)మహబూబాబాద్ జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో దిగులు పడుతున్నారు. ఆగస్టు 13వ తేదీతో ప్రీమియం చెల్లింపు ముగియడంతో రైతుబీమా ఉన్నట్లా, లేనట్లా అని కర్షకులు అయోమయానికి గురవుతున్నారు. రైతులకు అండగా ఉన్న ఈ పథకం ప్రశ్నార్థకంగా మారింది. బీమా గడువు గడిచి 17 రోజులు అయిపోయినప్పటికి రాష ్ట్రప్రభుత్వం ప్రీమియం బకాయిలు ఎల్ఐసీకి చెల్లించకపోవడంతో సమయం ముగిసిపోయింది. ఈ పథకంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఇది కొనసాగుతుందా! లేదా? అనేది రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది

రైతులు మరణించిన సమయంలో అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా ఉంటే కేవ లం పది రోజుల్లో రైతుబీమా నగదు రై తు కుటుంబంలోని నామినీ ఖాతాల్లో జమ అయ్యేవి. రైతు మరణించిన తర్వాత ఆపత్కాలంలో వారి కుటుంబానికి ఈ పరిహారం ఆదుకునేది. అలాం టి ఈ పథకం ఆగస్టు 13 అర్ధరాత్రితో ముగిసింది. ఆగస్టు 13 తేదీలోపే ప్రభుత్వం ఈ బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం చెల్లించకపోవడంతో 14వ తేదీ ఉదయం నుంచే ఈ పథకం గడువు ముగిసిపోయింది.

ఇందిరమ్మ బీమా పథకం ప్రవేశపెట్టి ప్రతీ కుటుంబానికి బీమా సౌకర్యం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ పథకం త్వరలోనే అమలు కానున్న నేపథ్యంలో రైతు బీమాను తొలగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande