
అమరావతి, 03 సెప్టెంబర్ (హి.స.)
శిశువు డైపర్లో దాదాపు రూ.50లక్షల విలువైన బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు.
కేరళంలోని ఓ విమానాశ్రయంలో 8 నెలల చిన్నారిని ఓ వ్యక్తి స్మగ్లింగ్కు ఉపయోగించుకున్నాడు. వివరాల్లోకెళ్తే.... యూఏఈలోని రస్ అల్ ఖైమా విమానాశ్రయం నుంచి మలప్పురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి కరిపుర్ (కాలికట్) అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. పక్కా సమాచారంతో ఉన్న డీఆర్ఐ అధికారులు.. ఎనిమిది నెలల శిశువు, మరో ఇద్దరు చిన్నారులతో వచ్చిన సదరు వ్యక్తిని అడ్డుకున్నారు.
తనిఖీ చేయగా శిశువు డైపర్లో రూ.50లక్షల విలువైన బంగారంతోపాటు అతడి వద్ద మరింత బంగారం లభించింది. మొత్తం విలువ రూ.కోటి ఉంటుందని అంచనా వేశారు. డీఆర్ఐ అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్