హుస్నాబాద్ రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి పొన్నం
హుస్నాబాద్ నియోజకవర్గంలోని పెండింగ్లో ఉన్న ఆర్అండ్్బ రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
Ponnam


హుస్నాబాద్, 03 సెప్టెంబర్ (హి.స.)

నియోజకవర్గంలోని పెండింగ్లో ఉన్న ఆర్అండ్్బ రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

నియోజకవర్గంలో ప్రతిపాదించిన ఆర్అండ్బై రోడ్లకు మంజూర్లు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారిపై పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేయాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న కల్వర్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు, మిట్టపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆరీబీ) పనులను త్వరగా చేపట్టాలని సూచించారు. ఈ పనులు పూర్తయితే వాహనదారుల ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. ఎల్కతుర్తి జంక్షన్ వద్ద కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట వైపు వెళ్లే రహదారులు కలుస్తున్నాయని, రహదారి ఇరుకుగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. కరీంనగర్-ఎల్కతుర్తి, ఎల్కతుర్తి -హనుమకొండ మధ్య కొనసాగుతున్న రహదారి పనులను వేగవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande