రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీకి ఛాన్స్....తెలంగాణ రాజకీయ అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం
తెలంగాణ కాంగ్రెస్లో తాజా రాజకీయ పరిణామాలు ఢిల్లీ వేదికగా ఉత్కంఠను రేపుతున్నాయి. ఈరోజు ఏఐసీసీ అగ్రినేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Rahul gandhi


హైదరాబాద్, 03 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తాజా రాజకీయ పరిణామాలు ఢిల్లీ వేదికగా ఉత్కంఠను రేపుతున్నాయి. ఈరోజు(గురువారం) ఏఐసీసీ అగ్రినేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత విభేదాలు, తదితర అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా రాహుల్తో సీఎం భేటీ తర్వాత మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకోబోయే నిర్ణయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. కొండా సురేఖ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించినట్లు సమాచారం. ఢిల్లీలో రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. కొండా సురేఖ అంశంపై నివేదికను, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సూచనలు కాంగ్రెస్ అధిష్ఠానానికి అందజేశారు. ఈరోజు రాహుల్తో సీఎం రేవంత్ భేటీ జరిగితే.. కొండా సురేఖపై చర్యల విషయంలో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande