
తెలంగాణ, 03 సెప్టెంబర్ (హి.స.) అంతర్జాతీయ క్యాబ్ సేవల కంపెనీ ఉబర్ టెక్నాలజీస్ సంస్థ వేల మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సుమారు 3,300 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా అధికారిక సమాచారం అందించారు.
పెరిగిన అనవసరమైన విభాగాలు, అదనపు మేనేజ్మెంట్ స్థాయిలు ప్రస్తుత పరిస్థితుల్లో వాటి అవసరం లేదని స్పష్టం చేశారు. మరియు, భవిష్యత్తులో కేవలం ఒక శాతం మంది ఉద్యోగులకు మాత్రమే ఇంటి నుండి పనిచేసే అనుమతి ఉంటుందని, మిగిలిన వారంతా తప్పనిసరిగా కార్యాలయాల నుంచే విధులు నిర్వహించాలని ఆదేశించింది.
ఈ లేఆఫ్ల ప్రభావం 20 శాతం మంది మేనేజర్లతో పాటు, ఇతర స్థాయిల సిబ్బందిపై కూడా ఉంటుందని సీఈవో పేర్కొన్నారు. ఇప్పటి వరకు సాఫ్ట్వేర్,ఐటీ జాబ్స్ వరకు ఉన్న ఈ ఉద్యోగాల కోతలు ఇప్పుడు చిన్న, చిన్న సంస్థల్లో కూడా మొదలయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్