సెప్టెంబర్ 5న విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి కార్యాలయం ప్రారంభం
నెల్లూరు శివాజీ సెంటర్లో ఈ నెల 5న విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి కార్యాలయం ప్రారంభం. సింగిల్ విండో ద్వారా అనుమతులకు రిజిస్ట్రేషన్ చేసుకోలని సూచన.
/ganesh-utsav-samiti-office-opening-september-5-nellore


నెల్లూరు, 03 సెప్టెంబర్ (హి.స.) విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి విస్తృతస్థాయి గణేష్ మండప నిర్వాహకుల సమావేశం స్థానిక విశ్రాంత్ హోటల్ నందు ఈ రోజు ఉదయం జరిగింది.

గౌరవాధ్యక్షులు పిట్టి సత్య నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు వాయుగుండ్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు భయ్యా వాసు ,విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కొండపల్లి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి టి భాస్కర్ రెడ్డి,గౌరవ సలహాదారు పి సురేంద్ర రెడ్డి లు సమావేశంలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... గతంలో నిమజ్జనము కనీస మౌలిక వసతులు కూడా లేని పరిస్థితులలో గణేష్ ఉత్సవాలను నిర్వహించే వారందరు సంఘటిత ఒక వేదికగా విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు జరిగిందని తెలిపారు. , ప్రస్తుతం నెల్లూరు నగరంలోని పెన్నా నది వద్ద పెన్నా ఘాట్ , నెల్లూరు చెరువు గణేష్ ఘాట్ ల వద్ద విస్తృతమైన మౌలిక సదుపాయాలతో వినాయక చవితి ఉత్సవాలకు ముమరంగా ఏర్పాట్లు జరుగుచున్నాయని తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీ శనివారం విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి కార్యాలయం నెల్లూరు నగరం ట్రంకు రోడ్డు, శివాజీ సెంటర్ లోని టీవీఎస్ కళ్యాణ సదన్ నందు తమ కార్యాలయం ప్రారంభిస్తుందని తెలిపారు. తాత్కాలిక వినాయక విగ్రహ నిర్వాహకులు సింగల్విండో ద్వారా అనుమతి కోసం టీవీఎస్ కళ్యాణ సదన్ కు వచ్చి ఆఫీసులో రిజిస్ట్రేషన్ చెచుకోవాలని కోరారు.

నగరంలో వివిధ కూడళ్ల లలోని తాత్కాలిక గణేష్ మండపాలలో వినాయక చవితి 14వ తేదీ నుంచి 5 రోజులపాటు గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుని సెప్టెంబర్ 18 వ తేదీ శుక్రవారం వివిధ మార్గాల గుండా నగరంలో కన్నుల పండగగా శోభాయాత్ర తో గణేష్ ఘాట్ మరియు పెన్నా ఘాట్లలో తాత్కాలిక గణనాథ నిమజ్జనోత్సవం ప్రభుత్వ సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించుకుందామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande