
ముంబై, 30 సెప్టెంబర్ (హి.స.)భారత్లో గత రెండు రోజులుగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. రెండు రోజుల్లో మేలిమి బంగారం ధర రూ.3,880 మేర పడిపోయింది. పశ్చిమాసియా అనిశ్చితులకు తోడు డాలర్ బలపడటం, యూఎస్ బాండ్స్పై రాబడులు పెరగడంతో బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి (సెప్టెంబర్ 30) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్ల 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1,48,790గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,390 వద్ద, 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,11,590 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,39,990గా ఉంది.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 10మేర ధర తగ్గి.. రూ.1,48790 గా ఉంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధరపై రూ.10 మేర తగ్గి.. రూ.1,36,390 గా ఉంది. వెండి కిలో ధరపై రూ.100 తగ్గి.. రూ.2,39,900 లుగా కొనసాగుతోంది.
హైదరాబాద్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,48,790, 22 క్యారెట్ల ధర రూ.1,36,390 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,48,790, 22 క్యారెట్ల ధర రూ.1,36,390 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,48,940, 22 క్యారెట్ల ధర రూ.1,36,540 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV