
సత్తెనపల్లి,, 30 సెప్టెంబర్ (హి.స.)
నరసరావుపేట జిల్లాలోని సింహభాగం ప్రభుత్వ బడుల్లో పాఠశాల యాజమాన్య కమిటీల (ఎస్ఎంసీ) ఎన్నికల ప్రక్రియ కోలాహలంగా సాగింది. మొత్తం 1,556 పాఠశాలలకు.. 13 ప్రాథమిక, ఒక ప్రాథమికోన్నత, 8 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 22 చోట్ల వివిధ కారణాలతో ఎన్నికలు నిలిపివేశారు. మిగిలిన అన్ని బడుల్లో ఎన్నికలు నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎస్ఎంసీ సభ్యులతోపాటు ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఎన్నుకున్నారు. ఛైర్మన్లతో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంఈవోలు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ