గిరిజన పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలంటూ గవర్నర్ను కోరిన నాయకులు
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు వినతిపత్రం ఇచ్చిన గిరిజన కుటుంబాలు
Mp


హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)

ఆదిలాబాద్ జిల్లా మావల మండల పరిధిలో సుమారు 30 ఏళ్లుగా నివాసముంటున్న పేద గిరిజన కుటుంబాలకు ఇండ్ల స్థలాలకు పట్టాలు మంజూరు చేసి వారికి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ బిజెపి ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, తెలంగాణ రాష్ట్ర తుడుం దెబ్బ అధ్యక్షుడు గోడం గణేష్ బుధవారం తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. సర్వే నంబర్ 72/23 పరిధిలో గోండ్, ప్రధాన్, కోలాం, తోటి, ఆంధ్, నాయకోపోడ్ తదితర షెడ్యూల్డ్ తెగలకు చెందిన పేద కుటుంబాలు, ముఖ్యంగా పీవీటీజీ తెగలకు చెందిన కుటుంబాలు దశాబ్దాలుగా శాశ్వత నివాసాలు ఏర్పరచుకుని నివాసముంటున్నా ఇళ్ల పట్టాలు లేకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అర్హులైన 2,000 కుటుంబాలకు తక్షణమే ఇళ్ల పట్టాల హక్కులు కల్పించేలా జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande