
హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.) శ్రీరాముడు, పరమశివుడి గురించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిజెపి శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ క్రాస్ రోడ్ వద్ద బుధవారం బిజెపి నాయకులు, కార్యకర్తలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. శ్రీరాముడిని ధనికులకు, శివుడిని పేదలకు ప్రతీకగా పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని బిజెపి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కూడా వారు తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధులు ప్రజల విశ్వాసాలను, దేశ ప్రధాని ని గౌరవించేలా బాధ్యతయుతమైన భాషను ఉపయోగించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ... హిందూ దేవతలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని, అన్ని మతాల దేవుళ్లను సమానంగా గౌరవించాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు