సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు.. 15.4 కిలోల గంజాయి లభ్యo.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎన్టీఎఫ్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 15.4 కిలోల గంజాయి లభ్యమైంది
Ganja


హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎన్టీఎఫ్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 15.4 కిలోల గంజాయి లభ్యమైంది. ప్లాట్ఫామ్ నంబర్ 10పై అనుమానాస్పదంగా ఉన్న రెండు బ్యాగులను గుర్తించిన పోలీసులు వాటిని తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. పోలీసులను గమనించిన నిందితులు బ్యాగులను అక్కడే వదిలేసి పరారైనట్లు ఇన్స్పెక్టర్ భిక్షపతి రెడ్డి తెలిపారు. స్టేట్ టాస్క్ ఫోర్స్ బీ టీమ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని తదుపరి విచారణ కోసం సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande