
హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం పరిధిలోని స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ కౌన్సిల్ మేయర్ గా హైదరాబాద్ మహిళ సంధ్యారెడ్డి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా ఉన్న ఆమె, తాజాగా కౌన్సిలర్ల మద్దతుతో మేయర్ పీఠాన్ని అధిరోహించి సెప్టెంబరు 2028 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. హైదరాబాద్లో లా విద్య పూర్తి చేసిన సంధ్యా రెడ్డి 1991లో ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడే ఇమిగ్రేషన్ న్యాయవాదిగా స్థిరపడి సామాజిక, రాజకీయ రంగాల్లో గుర్తింపు సంపాదించుకున్నారు.2021, 2024లలో స్థానిక ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచారు. 2023లోనే స్ట్రాత్ఫీల్డ్కు డిప్యూటీ మేయర్గా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఇక ఇప్పుడు ప్రముఖ మున్సిపల్ కౌన్సిల్ కు మేయర్ గా ఎన్నికై తెలంగాణకే గర్వకారణంగా నిలిచారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..