హైదరాబాద్లో అక్టోబర్ 2న మాంసం విక్రయాలపై పూర్తి నిషేధం.. జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు!
హైదరాబాద్లో అక్టోబర్ 2న మాంసం విక్రయాలపై పూర్తి నిషేధం.. జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు!
MEAT


హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో కఠిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. గాంధీజీకి ఘన నివాళులు అర్పించేలా, అలాగే అహింసా మార్గాన్ని స్మరించుకుంటూ నగరవ్యాప్తంగా అన్ని రకాల మాంసం విక్రయాలు మరియు వధశాలలను పూర్తిగా మూసివేయాలని జీహెచ్‌ఎంసీ యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అక్టోబర్ 2వ తేదీన జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పశువులు, గొర్రెలు, మేకల వధశాలలతో పాటు రిటైల్ మటన్, చికెన్ మరియు గోమాంస విక్రయశాలలు (మీట్ షాప్స్) పూర్తిగా మూసివేయాలని అధికారులు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలను గౌరవిస్తూ ప్రతి ఏటా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ నిర్ణయానికి నగర ప్రజలు, దుకాణదారులు మరియు మాంసం విక్రేతలు సహకరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా విక్రయాలు జరిపితే మున్సిపల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నగరంలోని మాంసం వ్యాపారులు, హోటళ్లు మరియు రెస్టారెంట్ల నిర్వాహకులు ఈ ముందస్తు ఆదేశాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande