యువతకు ఉపాదే మొదటి లక్ష్యం: కొచ్చి కాంక్లేవ్లో ఏపీ మంత్రి నారా లోకేశ్ వెల్లడి
యువతకు ఉపాదే మొదటి లక్ష్యం: కొచ్చి కాంక్లేవ్లో ఏపీ మంత్రి నారా లోకేశ్ వెల్లడి
Lokesh


అమరావతి, 30 సెప్టెంబర్ (హి.స.)

యువతకు ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కొచ్చి వేదికగా జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్-2026లో సీనియర్ జర్నలిస్ట్, ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ తో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలపై మాట్లాడారు.

రాష్ట్రంలో యువత నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్ ఉద్యోగాలేనని, అందుకే తమ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తోందని లోకేశ్ తెలిపారు. పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యా పాఠ్యాంశాలను మారుస్తూ, వివిధ రంగాల నుంచి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జెన్-జీ యువత వ్యవస్థలో సానుకూల మార్పు కోరుకుంటోందని, వారి ఆలోచనలతో కలిసి ముందుకు సాగడం తనకు ఎంతో ఉత్సాహాన్నిస్తోందని పేర్కొన్నారు.

ఏపీలో నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని తెలిపారు. క్రీడా కోటా కింద అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల జారీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా జరిగిందని గుర్తుచేశారు. ఈ అంశంపై న్యాయస్థానం లేదా సీబీఐ దర్యాప్తు కోరినా కోర్టు ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు.

టెక్నాలజీ రంగంలో రాష్ట్రం దూసుకుపోతోందని చెబుతూ, దేశంలోనే తొలి 156 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు లోకేశ్ ప్రకటించారు. పరిశోధనలు, మెటీరియల్ సైన్స్, క్రయోజెనిక్ టెక్నాలజీ వంటి అధునాతన రంగాలను ప్రోత్సహిస్తూ బలమైన క్వాంటమ్ ఎకోసిస్టమ్ ను నిర్మించడమే తమ లక్ష్యమన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని, గడచిన రెండేళ్ల కాలంలోనే 16 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని వెల్లడించారు. ఏఐ నుంచి క్వాంటమ్ టెక్నాలజీ వరకు అన్నింట్లోనూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని, అయితే విద్యా సంస్కరణలు ఫలితాలు ఇవ్వడానికి కనీసం దశాబ్ద కాలం పడుతుందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ అనే వినూత్న '3ఎస్' విధానాన్ని అమలు చేస్తున్నట్లు లోకేశ్ వివరించారు. ప్రాజెక్ట్ అనుమతుల్లో వేగం, పెట్టుబడిదారులకు నిరంతర సేవలందించడం, ప్రభుత్వాలు మారినా పాలసీల్లో స్థిరత్వం ఉండేలా చూడటం తమ ప్రత్యేకత అని చెప్పారు. వ్యవసాయం మొదలుకుని అత్యాధునిక క్వాంటమ్ రంగం వరకు మొత్తం 23 క్లస్టర్ల వారీగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని ఆయన వెల్లడించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande