గొల్ల కాపరుల సంక్షేమానికి బీమా పథకం : మంత్రి అడ్లూరి
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గొల్ల కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.
Minister


పెద్దపల్లి, 30 సెప్టెంబర్ (హి.స.) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గొల్ల కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. గొర్రె, మేకల బీమా పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మంత్రి అడ్లూరిని గొంగడితో సత్కరించి, గొర్రె పిల్లను బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంశాలపై ప్రభుత్వం ప్రజలకు వివరాలు వెల్లడిస్తుందని తెలిపారు.

బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం వెలుగులోకి తెస్తుంటే, తమ ఉనికిని కాపాడుకునేందుకు వారు తీవ్రంగా స్పందిస్తున్నారని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande