కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు.. రెడ్ల కోటాపై తీవ్ర విమర్శలు!
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు.. రెడ్ల కోటాపై తీవ్ర విమర్శలు!
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు.. రెడ్ల కోటాపై తీవ్ర విమర్శలు!


హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. రెండు సీట్లను కూడా ఒకే సామాజిక వర్గానికి (రెడ్డి) కేటాయించడంపై అధికార పార్టీ ఎమ్మెల్సీ, 'తీన్మార్ మల్లన్న' (చింతపండు నవీన్ కుమార్) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎంపిక వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, సీనియర్ నేత జానారెడ్డి ఈ నాటకానికి సూత్రధారి అంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి సామ రామ్మోహన్ రెడ్డిని, అలాగే నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు అభ్యర్థులు రెడ్లు కావడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంపై మల్లన్న మండిపడుతూ.. ఇది తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. రెడ్ల పార్టీ రెడ్లకు కాకుండా బీసీలకు టికెట్లు ఇస్తేనే ఆశ్చర్యపడాలి అని ఆయన ఘాటుగా ఎద్దేవా చేశారు.

'బలిపశువులు' మాత్రమే..

కాంగ్రెస్‌లోని రెడ్డి నేతలు అంతా కలిసి ఒక పెద్ద నాటకమాడారని మల్లన్న ఆరోపించారు. ఈ టికెట్ల కేటాయింపుల వెనుక కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డితో పాటు మరో టీచర్ ఎమ్మెల్సీ, మరో కీలక రెడ్డి నేత హస్తం ఉందని, వీరందరూ కలిసి ఒక కుట్ర పన్నారని విమర్శించారు. పార్టీ ప్రకటించిన ఇద్దరు అభ్యర్థులు కేవలం 'బలిపశువులు' మాత్రమేనని అభివర్ణించారు. పార్టీ గెలవడం ముఖ్యం కాదు, కేవలం 'రెడ్లు' మాత్రమే గెలవాలన్నదే వారి ఏకైక లక్ష్యమని మండిపడ్డారు.

ఈ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్‌లోని ఒక ముఖ్య వ్యక్తితో కూడా రహస్య ఒప్పందం కుదిరిందని మల్లగొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఈ గ్రాడ్యుయేట్ స్థానాల్లో కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదని, తాను సొంతంగా పోరాడి గెలిచిన తర్వాతే ఆ పార్టీకి ఆయా ప్రాంతాల్లో గుర్తింపు వచ్చిందని ఆయన గుర్తుచేశారు. సామాజిక న్యాయాన్ని విస్మరించి కేవలం ఒకే వర్గానికి పెద్దపీట వేయడంపై సొంత పార్టీ ఎమ్మెల్సీనే బహిరంగంగా గళం విప్పడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande