విజయవాడలో 'పేదలకు పట్టాభిషేకం': అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ(update)
విజయవాడలో 'పేదలకు పట్టాభిషేకం': అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ
Chandra Babu Naidu


అమరావతి, 30 సెప్టెంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని మకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 26,401 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. 120 ఏళ్ల నాటి ఇళ్ల స్థలాల సమస్యకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని, ఎన్టీఆర్ జిల్లాలో లబ్ధిదారులకు సగటున 130 గజాల స్థలానికి పట్టాలు అందించినట్లు ఆయన తెలిపారు. సొంత ఇల్లు అనేది పేదల జీవితకాల స్వప్నమని, దీని కోసం 40 నుంచి 50 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి ఆకాంక్షలను నెరవేరుస్తూ పేదల ఆత్మగౌరవానికి ఈ పట్టాభిషేకం కట్టబెట్టామని పేర్కొన్నారు. విశాఖ, మంగళగిరి, విజయవాడ కార్యక్రమాలతో కలిపి ఇప్పటివరకు సుమారు 60,000 పట్టాలు పంపిణీ చేశామని, వాటి విలువ దాదాపు రూ.52,000 కోట్లు ఉంటుందని వివరించిన సీఎం... లబ్ధిదారులు ఈ ఆస్తిని అమ్ముకోకుండా భవిష్యత్ కోసం కాపాడుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో డబుల్ ఇంజన్ సర్కార్ జెట్ స్పీడ్‌తో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోందని చెబుతూ, ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రతీ పేదవాడికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, మహిళల కోసం 'స్త్రీ శక్తి' పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో ఏసీ బస్సులను కూడా కొనుగోలు చేసి వాటిలోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande