తిరుమల తిరుపతి లో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
తిరుమల


తిరుమల, 30 సెప్టెంబర్ (హి.స.)తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్లు కాంప్లెక్స్ వెలుపలి వరకు విస్తరించడంతో తిరుమల గిరులు భక్తజనసందోహంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

దర్శన టికెట్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 24 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు నిరంతరం సేవలందిస్తున్నారు. భక్తులకు అన్నప్రసాదం, మంచినీరు, పాలు పంపిణీ చేయడంతో పాటు అవసరమైన వారికి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.

మరోవైపు నిన్న తిరుమలలో భక్తుల రద్దీ, సేవల వివరాలను దేవస్థానం అధికారులు అధికారికంగా విడుదల చేశారు. నిన్న ఒక్కరోజే మొత్తం 77,082 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే స్వామివారిపై భక్తిప్రపత్తులతో 34,039 మంది భక్తులు కల్యాణకట్టల్లో తలనీలాలు సమర్పించారు.రద్దీ దృష్ట్యా భక్తులు సహనంతో వేచి ఉండి, ఆలయ సిబ్బందికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande