ఉత్తమ ఉపాధ్యాయులుగా 173 మంది ఎంపిక
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఏపీ 173 మందిని ప్రభుత్వం విద్యాశాఖ గుర్తించింది. ఈ నెల 5న (శనివారం) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరికి అవార్డులు ప్రదానం చేయనుంది.
AP Govt

అమరావతి, 04 సెప్టెంబర్ (హి.స.)

ఉత్తమ ఉపాధ్యాయులుగా ఏపీ 173 మందిని ప్రభుత్వం విద్యాశాఖ గుర్తించింది. ఈ నెల 5న (శనివారం) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరికి అవార్డులు ప్రదానం చేయనుంది.

విజయవాడలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వీరికి అవార్డులు అందజేస్తారు. పాఠశాల విద్యలో 79 మంది, ఇంటర్ విద్యలో 24 మంది, సాంకేతిక విద్యలో 14 మంది, ఉన్నత విద్యలో 56 మందిని ఉత్తమ టీచర్లుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి ప్రశంసా పత్రం, రూ.20 వేల నగదు బహుమతి అందజేస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande