గోదావరి నదిని కాలుష్య రహితంగా మార్చాలి.... పవన్ కళ్యాణ్
గోదావరి నదిని కాలుష్య రహితంగా మార్చాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశించారు.
Pavan kalyan


అమరావతి, 04 సెప్టెంబర్ (హి.స.)

గోదావరి నదిని కాలుష్య రహితంగా మార్చాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశించారు.

కాలువల ద్వారా కలుస్తున్న కాలుష్య కారక వ్యర్థాలపై దృష్టి సారించాలన్నారు. నది ప్రక్షాళనను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని, ‘స్వచ్ఛ గోదావరి-పవిత్ర పుష్కరాలు’ అనే థీమ్తో సమగ్ర కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు.

పుష్కరాల నాటికి గోదావరి పవిత్రత ఉట్టిపడేలా, భక్తులు స్వచ్ఛమైన జలాల్లో స్నానం చేసే వాతావరణం కల్పించాలని సూచించారు. రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు గోదావరిలో కలుస్తున్న అన్ని ప్రధాన, ఉప కాలువలపై సమగ్ర అధ్యయనం చేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు గురువారం ఆయన ఆదేశాలిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande