
అమరావతి, 04 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వం ఐదవ విడత జిల్లా కలెక్టర్ల సదస్సుకు సిద్ధం అయింది. ఈ నెల 10, 11వ తేదీల్లో అమరావతిలోని సచివాలయంలో కాన్ఫరెన్స్ను నిర్వహించనుంది.
ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, సెక్రటరీలు, హెచ్వోడీలకు సాధారణ పరిపాలన శాఖ సమాచారం అందించింది. జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ 5.0 పేరుతో ప్రభుత్వం దీనిని నిర్వహిస్తోంది. రెండు, మూడు రోజుల్లో అజెండాను ప్రభుత్వం ఖరారు చేయనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ