
నెల్లూరు, 04 సెప్టెంబర్ (హి.స.) భారతదేశపు తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్యాన్'కు సంబంధించిన మొదటి ప్రయోగం త్వరలో నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17 మిషన్ ప్రయోగం విజయమైంది. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది తొలి విజయమని స్పష్టం చేశారు. మరో ఆరు ప్రయోగాలని నిర్వహిస్తామని తెలిపారు.
శుక్రవారం ఉదయం ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్.. నిర్దేశించిన 19 నిమిషాల్లోనే శాటిలైట్ నిర్దేశిత కక్ష్యలోకి చేరింది. నిర్దేశిత సమయంలో 28,934 కిలోమీటర్లు ప్రయాణించి నిర్ణీత కక్ష్యలోకి రాకెట్ చేరింది.
వాతావరణం, భూ పరిశీలనకి సంబంధించిన కీలక సమాచారాన్ని ఈ శాటిలైట్ EOS-05 అందించనుంది.
ఈ రాకెట్ విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారత సాంకేతిక నైపుణ్యం, శాస్త్రవేత్తల కృషికి ప్రతీకగా మరో చారిత్రాత్మక విజయంగా నిలిచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV