ఢిల్లీలో ఘోర ప్రమాదం.... కుప్పకూలిన భవనం.....శిథిలాల కింద పలువురు
ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఒక భవనం కుప్పుకూలడంతో, ఆ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు.
Delhi


ఢిల్లీ , 06 సెప్టెంబర్ (హి.స.) ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఒక భవనం కుప్పుకూలడంతో, ఆ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. స్థానికులు వెంటనే ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్కు, పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాద స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.

బిల్డింగ్ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఆ శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు అనే విషయంలో స్పష్టత లేదు. బిల్డింగ్ కూలడానికి గల కారణాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. కొద్ది రోజులుగా ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వర్షాలు కూడా బిల్డింగ్ కూలడానికి ఒక కారణం అయ్యుండొచ్చని అంచనా.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande