ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మహాధర్నా
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Congress

హైదరాబాద్, 06 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

ప్రతిపక్ష నేతగా ప్రజల తరఫున అసెంబ్లీలో ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కేసీఆర్ సభకు హాజరు కావడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు పొందుతూ అసెంబ్లీకి దూరంగా ఉండటం సమంజసం కాదని విమర్శించారు. ప్రజాధనాన్ని పొందుతున్న వ్యక్తి ప్రజా సమస్యలపై చట్టసభలో తన బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతూ సభకు రాకపోతే ఆ పదవిలో ఎందుకు కొనసాగుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

 rajesh pande